తల్లి గొప్పతనాన్ని ఆవిష్క‌రించే చిత్రమే ‘అమ్మ’

తల్లి గొప్పతనాన్ని ఆవిష్క‌రించే చిత్రమే ‘అమ్మ’

Published on May 9, 2025 8:30 AM IST

Amma

మాతృమూర్తి విలువను గుర్తిస్తూ తెరకెక్కుతున్న సందేశాత్మక లఘు చిత్రమే ‘అమ్మ’. ఏఏఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, ‘నాట్యమార్గం’ సహకారంతో ఈ షార్ట్ ఫిలిం.. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మే 11న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి తెర‌పై ‘అమ్మ’గా లాలించ‌బోతోంది. ఇంద్రాణి దవలూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన “అందెల రవమిది” మూవీ విడుద‌ల‌కు ముందే ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క‌ అవార్డులు అందుకుంది. తాజాగా ‘అమ్మ’ మూవీలోనూ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.

ఇంద్రాణి న‌టించిన ‘అమ్మ’ షార్ట్ మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఏమీ యాచించని నిస్వార్థ ప్రేమమూర్తి అమ్మ. అలాంటి ఓ అమ్మ కథను చూపించే సందేశాత్మక చిత్రమే మా ‘అమ్మ’ మూవీ అని అన్నారు.

ఈ షార్ట్ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అందించిన హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ, “మనకి కష్టం వస్తే కన్నీరు కార్చే అమ్మకే బాధ కలిగిస్తే ఆమె పడే ఆవేదన ఎలా ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపించే అమ్మకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? ఇదే మా మూవీ సబ్జెక్ట్,” అని తెలిపారు.

తాజా వార్తలు