టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ ఇపుడు మంచి బజ్ ని కూడా సెట్ చేసుకుంది. అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ అండ్ ఫ్యాన్స్ కి మాత్రం సస్పెన్స్ అలానే కొనసాగుతుంది.
ఇలా కింగ్డమ్ మే 30న రాకపోవచ్చు అనే డౌట్స్ ఇపుడు మళ్ళీ మొదలయ్యాయి. దాదాపు సినిమా జూలై కి వాయిదా పడినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటన ఇస్తే తప్ప తేలేలా లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


