బాలయ్య కోసం పదేళ్ల తర్వాత వస్తున్న హీరో.. సెట్ అయితే కేక..!

బాలయ్య కోసం పదేళ్ల తర్వాత వస్తున్న హీరో.. సెట్ అయితే కేక..!

Published on Mar 4, 2026 2:00 AM IST

Manchu-Manoj-and-NBK111

నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK111 మార్చి 5 నుంచి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసిన దర్శకుడు గోపీచంద్, బాలయ్యను మరోసారి పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో చూపించేందుకు సిద్ధమయ్యాడు. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మంచు మనోజ్‌ను సంప్రదించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రంలో బాలయ్యతో కలిసి నటించిన మనోజ్, ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ వెండితెరపై రిపీట్ అవుతుంది. బాలయ్యతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో మనోజ్ ఈ ఆఫర్‌కు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, రాబోయే దసరా కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు