‘భైరవం’ నుండి మరో అప్డేట్ రెడీ..!

‘భైరవం’ నుండి మరో అప్డేట్ రెడీ..!

Published on May 10, 2025 3:32 PM IST

Bhairavam

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటిస్తుండటంతో ఈ మూవీపై సినీ సర్కిల్స్‌లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సాంగ్‌ను మే 11న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘భైరవం’ చిత్రాన్ని మే 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

తాజా వార్తలు