మోహన్ లాల్ మాస్ కంబ్యాక్.. మరో 200 కోట్ల సినిమా

మోహన్ లాల్ మాస్ కంబ్యాక్.. మరో 200 కోట్ల సినిమా

Published on May 11, 2025 6:16 PM IST

Untitled 5

మోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ నుంచి ఈ ఏడాదిలో అది కూడా నెల వ్యవధిలోనే రెండు సినిమాలు రిలీజ్ చేశారు. ‘ఎంపురాన్’ చిత్రం తర్వాత ‘తుడరుం’ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి తన నుంచి రిలీజ్ కి రాగ ఇపుడు ఈ రెండు సినిమాలు కూడా భారీ హిట్ అయ్యాయి. మరి ఎంపురాన్ చిత్రం 300 కోట్ల మేర వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకుంటే ఇపుడు తుడరుం ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

మరి తన నుంచి బరోజ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత వరుసగా రెండు ఈ రేంజ్ హిట్స్ ని తాను అందుకోవడం అనేది సెన్సేషనల్ మాస్ కంబ్యాక్ అని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి మోహన్ లాల్ మాత్రం మళయాళ సినిమా దగ్గర భారీ రెవెన్యూస్ ని అందించారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు