‘వీరమల్లు’ కోసం చాలా ఏళ్ల తర్వాత పవన్ ఇలా!

‘వీరమల్లు’ కోసం చాలా ఏళ్ల తర్వాత పవన్ ఇలా!

Published on May 19, 2025 5:00 PM IST

HHVM

ఇప్పుడు మన తెలుగు నుంచి రాబోతున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమానే “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల దగ్గరకి వస్తుండగా మేకర్స్ సాలిడ్ ప్లానింగ్స్ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు.

మరి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్ లోకి రాబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. పవన్ నుంచి ఎన్నో ఏళ్ళు ముందే ప్రమోషన్స్ అనే మాటనే మర్చిపోయారు అభిమానులు. అయితే పవన్ ప్రమోషన్స్ చేసేది మన దగ్గర కాదు అని తెలుస్తుంది. నార్త్ సైడ్ ఆడియెన్స్ అండ్ మార్కెట్ కోసం పవన్ హిందీలో మీడియాలో హాజరు కానున్నట్టు తెలుస్తుంది. తెలుగులో ఎలాగో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ హాజరు కానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు