టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే “శంబాల”. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ఆది సాయి కుమార్ కి మంచి కంబ్యాక్ సినిమాగా నిలిచి అదరగొట్టింది. తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఓటిటిలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది.
అయితే థియేటర్స్, ఓటిటి తర్వాత ఈ సినిమా బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకోగా వారు ఈ థ్రిల్లర్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ అందించారు. ఈ మార్చ్ 8 సాయంత్రం 6 గంటలకి ఈ సినిమా ప్రసారం కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
ఇక ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో అర్చన అయ్యర్, శ్వసిక, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. అలాగే మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజులు నిర్మాణం వహించారు.


