‘థగ్ లైఫ్’ సర్‌ప్రైజ్‌కు టైమ్ ఫిక్స్

‘థగ్ లైఫ్’ సర్‌ప్రైజ్‌కు టైమ్ ఫిక్స్

Published on May 20, 2025 8:04 PM IST

Thug Life m

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ కాగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి ‘షుగర్ బేబి’ అనే పాటను రేపు(మే 21న) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, జోజు జార్జ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూన్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు