థీమ్ ఆఫ్ గజపతి.. పవర్‌ఫుల్ ఎలివేషన్‌తో అదిరిపోయింది!

థీమ్ ఆఫ్ గజపతి.. పవర్‌ఫుల్ ఎలివేషన్‌తో అదిరిపోయింది!

Published on May 20, 2025 10:07 PM IST

Bhairavam 3

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మంచు మనోజ్ చేస్తున్న గజపతి పాత్రకు సంబంధించిన ‘థీమ్ ఆఫ్ గజపతి’ని మేకర్స్ రిలీజ్ చేశారు. గజపతి పాత్రను ఎలివేట్ చేస్తూ సాగే ఈ థీమ్ సాంగ్ ఆసక్తికరంగా ఉంది.

ఇక ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమాలో మనోజ్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు