విజయ్ సేతుపతి కోసం లొకేషన్స్ వేటలో పూరి జగన్నాధ్

విజయ్ సేతుపతి కోసం లొకేషన్స్ వేటలో పూరి జగన్నాధ్

Published on May 28, 2025 12:00 AM IST

Untitled 43

టాలీవుడ్‌లో రాబోయే క్రేజీ కాంబినేషన్స్‌లో దర్శకుడు పూరి జగన్నాధ్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మూవీ కూడా ఒకటి. ఈ ప్రాజెక్టును ఇటీవల అనౌన్స్ చేయగా దీనిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈసారి విజయ్ సేతుపతి వంటి వెర్సటైల్ యాక్టర్‌తో పూరి ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో టబు, దునియా విజయ్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్, చెన్నై నగరంలోని లొకేషన్స్ వేటలో ఉన్నాడట.

ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్‌ను అక్కడే ఆయన షూట్ చేస్తాడట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాధ్ ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు