లేట్ గా వచ్చినా మాస్ రెస్పాన్స్ తో ‘పెద్ది’ కొత్త సొంగ్

లేట్ గా వచ్చినా మాస్ రెస్పాన్స్ తో ‘పెద్ది’ కొత్త సొంగ్

Published on Mar 3, 2026 8:00 AM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ సినిమానే పెద్ది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ దెబ్బకి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. రెహమాన్ వాయిస్ మరియు బీట్స్ కి అలాగే రామ్ చరణ్ స్టెప్పులకి ఇప్పుడు మాస్ రెస్పాన్స్ నమోదు అవుతుంది.

ఒకింత ఈ సాంగ్ లేట్ గా వచ్చినప్పటికీ తెలుగు, హిందీ లలో భారీ రెస్పాన్స్ నమోదు అవుతుంది. తెలుగు వెర్షన్ అయితే టైం కాని టైం లో వచ్చినప్పటికీ 3 లక్షల 50 వేలకి పైగా లైక్స్ సాధించింది. హిందీలో కూడా లక్ష లైక్స్ క్రాస్ చేసేసింది. దీనితో ఈ సాంగ్ ఈ రేంజ్ లో క్లిక్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందే.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు