గద్దర్ అవార్డ్స్ : విజేతలకు మెగా విషెస్ చెప్పిన చిరంజీవి!

గద్దర్ అవార్డ్స్ : విజేతలకు మెగా విషెస్ చెప్పిన చిరంజీవి!

Published on May 29, 2025 11:00 PM IST

chiru 4

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గద్దర్ అవార్డ్స్’ను నేడు ప్రకటించారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్‌గా ‘పుష్ప-2’ చిత్రంలో నటించిన అల్లు అర్జున్ నిలిచాడు. ఇక బెస్ట్ హీరోయిన్‌గా నివేదా థామస్, బెస్ట్ చిత్రంగా ‘కల్కి 2898 ఎడి’ అవార్డులు గెలిచాయి. వీటితో పాటు మరికొన్ని అవార్డులను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

చాలా కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డుల ప్రకటన రావడంతో సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘గద్దర్ అవార్డ్స్’ గెలుచుకున్న విజేతకు తన బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి ప్రకటించిన ఈ గద్దర్ అవార్డ్స్ కళాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి.. వారి శ్రమకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేస్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

ఇక సినిమా పరిశ్రమకు చెందిన పలువురు గద్దర్ అవార్డ్స్ విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు