పిక్ టాక్: రాయల్ లుక్స్ లో అదరగొట్టిన రామ్ చరణ్!

పిక్ టాక్: రాయల్ లుక్స్ లో అదరగొట్టిన రామ్ చరణ్!

Published on May 31, 2025 8:04 AM IST

ramCharan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ సరికొత్త మేకోవర్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ లుక్స్ లోనే తాను మాస్ గా కనిపిస్తున్నాడు అలాగే క్లాస్ లుక్ లో కూడా దర్శనమిస్తున్నాడు.

మరి ఇలా లేటెస్ట్ గా తన నుంచి మంచి రాయల్ లుక్స్ బయటకి వచ్చాయి. ఆ మధ్య విదేశీ పర్యటన చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సూట్ లో స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టాడు. మరి లేటెస్ట్ గా తన ఫోటోగ్రాఫర్ ఆరిఫ్ మినాహ్ (Arif Minhaz) షేర్ చేసిన పిక్స్ కొన్ని వైరల్ గా మారాయి. దీనితో ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే ఈ లుక్స్ లో ఒక సాలిడ్ యాక్షన్ డ్రామా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకునితో పడితే భలే ఉంటుంది అని అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు