షాకింగ్: ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకునిపై లైంగిక వేధింపుల కేసు!

షాకింగ్: ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకునిపై లైంగిక వేధింపుల కేసు!

Published on Mar 2, 2026 3:01 PM IST

chidambaram

2024 లో మలయాళ సినిమా ఎప్పుడు చూడని రేంజ్ భారీ హిట్స్ సొంతం చేసుకొని రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఏడాదిలో ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్స్ అయ్యాయి. కానీ ఆ అన్ని సినిమాల్లో కంటే మాత్రం “మంజుమ్మల్ బాయ్స్” అనే సర్వైవల్ ఎమోషనల్ చిత్రం మాత్రం సెన్సేషన్ ని సెట్ చేసింది.

అలాంటి విజయాన్ని అందించిన దర్శకుడు చిదంబరం విషయంలో ఓ షాకింగ్ వార్త ఇప్పుడు సినీ ప్రేక్షకులని విస్మయానికి లోను చేసింది. అయితే మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరంపై ఓ నటి లైంగిక ఆరోపణల కేసు వేసినట్టు తెలుస్తుంది. కొచ్చిలో ఈ దర్శకునిపై కేసు బుక్ కాగా ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కొచ్చి పోలీస్ వారు అతనిపై కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆరంభించినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఆమె తనపై 2022 లో లైంగిక వేధింపులు చేసారని ఆమె కంప్లైంట్ లో తెలుస్తుంది. కానీ అప్పుడు జరిగితే ఇప్పుడు కేసు బయటకి రావడం ఏంటని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ షాకింగ్ ఘటనపై చిదంబరం ఇంకా ఎలాంటి స్పందన అందించలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు