విషాదం: తెలుగు మహిళా యాంకర్ ఆత్మహత్య!

విషాదం: తెలుగు మహిళా యాంకర్ ఆత్మహత్య!

Published on Jun 28, 2025 10:02 AM IST

swecha 1

తెలుగు బుల్లితెర దగ్గర ఉన్న అనేక ఛానెల్స్ అందులో అనేకమంది తెలుగు యాంకర్స్ కూడా కనిపిస్తుంటారు. అయితే కొంతమంది నోటెడ్ న్యూస్ యాంకర్స్ లో స్వేచ్ఛ కూడా ఒకరు. అయితే ఈ యాంకర్ విషయంలో ఇప్పుడో విషాద వార్త ఇపుడు బయటకి వచ్చింది. ఆమె అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన షాకింగ్ గా మారింది.

హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న స్వేచ్ఛకి కొన్నాళ్ల కితమే విడాకులు కాగా తాను తన పన్నెండేళ్ల కూతురు సహా స్వేచ్ఛ తన స్నేహితుడుతో కలిసి ఉన్నారట. అయితే అతనితో వచ్చిన వాగ్వాదంతో మనస్పర్థలు మూలానే స్వేచ్ఛ ఆత్మహత్యకి పాల్పడినట్టు ఇపుడు వినిపిస్తుంది. దీనితో జర్నలిస్ట్ లలో విషాదం నెలకొనగా ఆమెతో పాటుగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న ఇతర జర్నలిస్ట్ లు ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు