‘కన్నప్ప’కు అసలు పరీక్ష మొదలు!

‘కన్నప్ప’కు అసలు పరీక్ష మొదలు!

Published on Jun 30, 2025 12:00 AM IST

kannappa 0 1

మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంకా అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి బిగ్ స్టార్స్ కలయికలో బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన డివోషనల్ హిట్ చిత్రమే “కన్నప్ప”. అయితే అంచనాలు అందుకొని అదరగొట్టిన ఈ చిత్రం రిలీజ్ డేట్ నుంచి వీకెండ్ కంప్లీట్ అయ్యిన వరకు సాలిడ్ బుకింగ్స్ తో మంచి ఆదరణ అందుకుంది.

అయితే ఇక నుంచి అసలు పరీక్ష మొదలైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే హాలిడేస్ అయ్యాయి ఇక వర్కింగ్ డేస్ లో కన్నప్ప కి థియేటర్స్ లో ఆదరణ ఎలా ఉంటుందో అనే దాని బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ టెస్ట్ లో కూడా కన్నప్ప పాస్ అయితే గనుక భారీ విజయం సొంతం చేసుకున్నట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంకి స్టీపెన్ డేవస్సీ సంగీతం అందించగా మోహన్ బాబు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు