హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ “మాతృ” ఆగస్టు 8న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా నటించగా, అలీ, ఆమనీ, రవి కాలే, పృథ్వీ రాజ్, దేవి ప్రసాద్, నందినీ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
విభిన్నమైన సైంటిఫిక్ థ్రిల్లర్ కథనంతో దర్శకుడు జాన్ జాక్కి “మాతృ” సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై మంచి స్పందన పొందింది.
నిర్మాత బూర్లె శివ ప్రసాద్ మాట్లాడుతూ – “మా బ్యానర్‌లో రూపొందించిన ‘మాతృ’ సినిమాను ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. డిఫరెంట్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ‘మాతృ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. థియేటర్లలో కూడా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం,” అన్నారు.


