ఆకుల అఖిల్, దర్శిక మీనన్ జంటగా నటించిన “బాలుగాడి లవ్ స్టోరీ” చిత్రం ఆగస్ట్ 8న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో, ఆకుల మంజుల నిర్మించిన ఈ చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, శబరి నిర్మాత మహేంద్రనాథ్, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మానిక్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, “బాలుగాడి లవ్ స్టోరీ టైటిల్, పాటలు బాగున్నాయి. కొత్త నిర్మాతలు, దర్శకులకు ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత ఆకుల మంజుల మాట్లాడుతూ, “మా అబ్బాయి అఖిల్, దర్శకుడు శ్రీనివాస్ తేజ్, నేను… మా అందరికీ ఇది మొదటి సినిమా. ఈ సినిమా విజయం సాధించి మాకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను” అన్నారు.
నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ, “నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు శ్రీనివాస్ తేజ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఘన శ్యామ్ గారు మంచి పాటలు ఇచ్చారు. ఆగస్ట్ 8న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు.
దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ, “చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. నటీనటులు చాలా బాగా చేశారు. అఖిల్‌కు మీ అందరి ఆదరణ కావాలి” అన్నారు.
హీరో ఆకుల అఖిల్ మాట్లాడుతూ, “మేము ఎంతో ఎదురుచూస్తున్న ‘బాలుగాడి లవ్ స్టోరీ’ ఆగస్ట్ 8న వస్తోంది. ప్రేక్షకులు మా సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. మాకు మీ సపోర్ట్ కావాలి” అని కోరారు.
ఆగస్ట్ 8న “బాలుగాడి లవ్ స్టోరీ” విడుదల – ప్రీ-రిలీజ్ వేడుకలో చిత్ర బృందం సందడి!
ఆగస్ట్ 8న “బాలుగాడి లవ్ స్టోరీ” విడుదల – ప్రీ-రిలీజ్ వేడుకలో చిత్ర బృందం సందడి!
Published on Aug 4, 2025 7:00 AM IST
సంబంధిత సమాచారం
- తన మొదటి హీరోతో అనీల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి క్రేజీ మల్టీస్టారర్ లాక్
- Allu Sirish Nayanika Wedding: రెండు ముఖ్య తేదీల్ని కన్ఫర్మ్ చేసిన శిరీష్
- వైరల్ పిక్స్: ఎట్టకేలకి రష్మిక, విజయ్ పెళ్లి పిక్స్ బయటకి ఎమోషనల్ మూమెంట్స్
- భారీ క్లైమాక్స్ షూట్ లో ‘సంబరాల ఏటి గట్టు’.. విజువల్స్ వైరల్
- మృణాల్ తో ఐకాన్ స్టార్..? హింట్ ఇచ్చిన బన్నీ
- లేటెస్ట్: ‘పెద్ది’ రెండో సాంగ్ డేట్ వచ్చేసింది.. మాస్ మేనియా ఎప్పుడు నుంచంటే!
- ఫోటో మూమెంట్: మెహర్, వినాయక్ లతో డార్లింగ్ కల్మషం లేని చిరునవ్వు
- ‘వారణాసి’: రామాయణ యుద్ధ సన్నివేశాలన్నీ ఇక్కడే
- India vs Zimbabwe T20 World Cup 2026: ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌కు రెడీ అయిన టీమిండియా.. నెట్స్‌లో భారీ సిక్సర్లతో ప్రాక్టీస్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ది బ్లఫ్’ – తెలుగు డబ్ హాలీవుడ్ చిత్రం ప్రైమ్ వీడియోలో
- అఫీషియల్ గా భార్య భర్తలైన విజయ్, రష్మిక.. సరిగ్గా ఇన్ని నిమిషాలకి!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘వారణాసి’ బ్యూటీ హాలీవుడ్ యాక్షన్ సినిమా.. ఎందులో అంటే
- నార్త్ మార్కెట్ లో ‘టాక్సిక్’ని తక్కువ అంచనా వేస్తున్నారా?
- ‘పెద్ది’ రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా?
- ‘భోగి’ ఫస్ట్ లుక్.. బీస్ట్ మోడ్ లో శర్వానంద్, రిలీజ్ డేట్ కూడా ఖరారు
- లేటెస్ట్: ‘పెద్ది’ రెండో సాంగ్ డేట్ వచ్చేసింది.. మాస్ మేనియా ఎప్పుడు నుంచంటే!
- ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి భారీ ఆఫర్.. ఏకంగా ‘పుష్ప’ మేకర్స్ తో?


