ప్రేతభయం కంటే మందు ప్రేమ పరిచయం.. ‘కిష్కింధపురి’ సాలిడ్ అప్డేట్ ఇదే.!

ప్రేతభయం కంటే మందు ప్రేమ పరిచయం.. ‘కిష్కింధపురి’ సాలిడ్ అప్డేట్ ఇదే.!

Published on Aug 5, 2025 10:00 PM IST

Kishkindhapuri

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తుండగా హార్రర్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు వారు రెడీ అయ్యారు. ఈ మేరకు ఓ అనౌన్స్‌మెంట్ కూడా తాజాగా చేశారు. ‘ప్రేతభయం కంటే ముందు ప్రేమ పరిచయం చేస్తున్నాం’ అంటూ ఓ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇక ఈ పాటను ఆగస్టు 7న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు