దీపావళి కానుకకు వారం ముందే అక్టోబర్ 10న “ఎర్రచీర – ది బిగినింగ్” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ – శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో, రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంతో పాటు కీలకపాత్రలో కనిపించనున్నారు.
హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని క్లియర్ సర్టిఫికెట్ పొందింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్ అని సెన్సార్ టీమ్ ప్రశంసించింది.
సినిమా ట్రైలర్ చూసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ – “ఎర్రచీర ట్రైలర్ చాలా బాగుంది. అక్టోబర్ 10న థియేటర్స్ లో తప్పక చూడాలి” అని తెలిపారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 3న ట్రైలర్ విడుదల, అక్టోబర్ 5న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నాయి.


