‘ఫౌజీ’ హీరోయిన్‌ను ఫిదా చేసిన ప్రభాస్.. ఎలాగో తెలుసా..?

‘ఫౌజీ’ హీరోయిన్‌ను ఫిదా చేసిన ప్రభాస్.. ఎలాగో తెలుసా..?

Published on Feb 23, 2026 12:00 PM IST

Fauji-0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రంలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

అయితే, ప్రభాస్ మంచితనానికి.. ఆయన చూపెట్టే హాస్పిటాలిటీకి ఇప్పుడు ఇమాన్వి సైతం ఫిదా అయింది. ప్రభాస్ తన ఇంటి నుంచి ఇమాన్వికి భోజనం పంపడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ప్రభాస్ తోటి స్టార్స్‌ను ఇంత ఇష్టంగా చూసుకుంటాడని తెలుసుకుని ఇమాన్వి ప్రభాస్‌కు ఫ్యాన్ అయిపోయింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో అనుపమ్ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు