‘అఖండ 2’ పుకార్లు నమ్మొద్దు.. తాండవానికి సిద్ధం అంటున్న మేకర్స్..!

‘అఖండ 2’ పుకార్లు నమ్మొద్దు.. తాండవానికి సిద్ధం అంటున్న మేకర్స్..!

Published on Dec 11, 2025 7:00 PM IST

Akhanda-2 Movie

బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ నైజాం ప్రీమియర్ షోలను హైకోర్టు రద్దు చేసిందనే వార్తలు గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్లు అభిమానుల్లో గందరగోళం, ఆందోళన రేపాయి.

అయితే, చిత్రబృందం వెంటనే స్పందించి ఈ వార్తలను ఖండించింది. ప్రీమియర్ షోలు నిర్దేశించిన సమయానికే జరుగుతాయి అని స్పష్టంగా వెల్లడించింది. ఏ విధమైన నిర్ధారణలేని అపోహలు, తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని కూడా విజ్ఞప్తి చేసింది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ బాలయ్య యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సజావుగా కొనసాగుతున్నాయని టీమ్ తెలిపింది. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, సంయుక్త కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ నిర్మించగా, థమన్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు