షాకింగ్: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్.. కారణమిదే!

షాకింగ్: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్.. కారణమిదే!

Published on Dec 12, 2025 1:03 PM IST

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినీ రంగంలోనే కాకుండా పొలిటికల్ గా కూడా నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న వ్యక్తి అని అందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు విభాగాల్లో కూడా పవన్ కళ్యాణ్ పై పాజిటివిటీతో పాటుగా నెగిటివిటీ కూడా అందరికీ ఉన్నట్టే ఉంది. మరి ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినట్టుగా ఇప్పుడు నిర్ధారణ అయ్యింది.

అయితే పవన్ ఢిల్లీ న్యాయస్థానంలో తన వ్యక్తిత్వ హక్కులని కాపాడాలని దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో తనపై జరుగుతున్న మార్ఫింగ్, ఎడిట్లు తదితర ఫైల్స్ లాంటివి తొలగించాలని పవన్ విన్నవించుకున్నారట. ఇక దీనిపై న్యాయస్థానం అందుకు సంబధించిన లింక్ లని 48 గంటల్లో పొందుపరచాలని ఆదేశించారు.

పవన్ తరపున దీనిని అడ్వకెట్ సాయి దీపక్ చూసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో వాటిని తొలగించడానికి 7 రోజులు సమయం ఇచ్చారట. అలానే నెక్స్ట్ విచారణ నెక్స్ట్ 22 కి జరుగుతుందట. మరి దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు