‘రామాయణ 2’ పై బిగ్ రివీల్ చేసిన రణబీర్ కపూర్!

‘రామాయణ 2’ పై బిగ్ రివీల్ చేసిన రణబీర్ కపూర్!

Published on Aug 4, 2026 5:59 PM IST

ఇప్పుడు బాలీవుడ్ సినిమా నుంచి రానున్న భారీ చిత్రాల్లో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ కోసం అందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా ఆల్రెడీ పార్ట్ 1 ని ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు.

అయితే పార్ట్ 2 ని వచ్చే ఏడాది దీపావళికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాపై రణబీర్ కపూర్ బిగ్ రివీల్ చేసాడు. పార్ట్ 2 షూట్ అప్పుడే 50 శాతం షూట్ ని పూర్తి చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. అలాగే పార్ట్ 2 ని కూడా అనుకున్న సమయానికే విడుదల చేసేలా అన్ని పనులు చేస్తున్నట్టు తెలిపాడు. సో రామాయణ విషయంలో ఫ్యాన్స్ కి ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ కి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు