డిసెంబర్ 25న థియేటర్లలోకి ‘బ్యాడ్ గాళ్స్

డిసెంబర్ 25న థియేటర్లలోకి ‘బ్యాడ్ గాళ్స్

Published on Dec 13, 2025 7:00 AM IST

BAD GIRLS

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు). అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్ల తదితరులు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “జాతి రత్నాలు, మ్యాడ్ తరహాలో సాగే పూర్తి వినోదాత్మక చిత్రమిది. ఆ తరహా కామెడీని అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. అనూప్ రూబెన్స్ సంగీతం, ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్రధాన ఆకర్షణ” అని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ‘ఇలా చూసుకుంటానే’ పాటకు 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయని, త్వరలోనే టీజర్, ట్రైలర్‌లను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు