ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ #AA23 షూటింగ్ ప్రారంభం కాకముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం ఒక అనౌన్స్‌మెంట్ వీడియోతో ఈ కాంబినేషన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కోసం అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ (#23Theme) ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ కంటే ఎక్కువ రీల్స్ మార్కును దాటేసింది.
ఒక సినిమా థీమ్ మ్యూజిక్ విడుదలైన కొద్ది కాలంలోనే ఈ స్థాయి రికార్డును అందుకోవడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2026లో సెట్స్ పైకి వెళ్లనుంది.
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లోని అంశాలు ఇందులో ఉంటాయా లేదా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.


