ఛలో, భీష్మ, రాబిన్‌హుడ్ వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేయబోతున్నారు. దర్శకుడిగా విజయవంతమైన ఆయన, ఈసారి నిర్మాతగా మారుతూ వాట్ నెక్స్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
తన తొలి నిర్మాణ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను వెంకీ కుడుముల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మూవీ టైటిల్‌ను డిసెంబర్ 14న అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో కొత్త హీరో ప్రధాన పాత్రలో నటించనుండటంతో, ఆ ‘న్యూ గయ్’ ఎవరన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. యువ నటి అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మహేష్ ఉప్పాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన పూర్తి మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-అనౌన్స్‌మెంట్ టీజర్‌కు మంచి స్పందన రావడంతో, ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో అందరూ ఈ చిత్ర టైటిల్ రివీల్ కోసం వేచి చూస్తున్నారు.


