విజయ్, రష్మిక పెళ్లి డీటెయిల్స్ లీక్.. అతిధులు ప్రైవసీకి భంగం

విజయ్, రష్మిక పెళ్లి డీటెయిల్స్ లీక్.. అతిధులు ప్రైవసీకి భంగం

Published on Feb 18, 2026 8:49 PM IST

rashmika-vijay

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ఇపుడు వరుస భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో తన కో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉంది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో వీరి పెళ్లి వేడుక రోజు కూడా దగ్గరకి వస్తుండగా ఇప్పుడు సోషల్ మీడియాలో వీరి పెళ్లి పత్రిక అంటూ కొన్ని డీటెయిల్స్ లీక్ అయ్యి షాకింగ్ గా మారింది. దీంతో చాలామంది ఆ పెళ్లి కార్డు డీటెయిల్స్ సహా అందులో ఉన్న ఒక నెంబర్ ని కూడా వైరల్ చేయడం మొదలు పెట్టారు. దీనితో ఆ పెళ్ళికి హాజరయ్యే అతిధులు విషయంలో ఖచ్చితంగా వారి ప్రైవసీకి భంగం ఏర్పడే అవకాశం ఉందని చెప్పాలి.

ప్రేక్షకుల్లో ఓ స్టార్ పెళ్లి విషయంలో ఉత్సుకత ఉంటుంది కానీ మరీ ఇంతలా వారి పర్శనల్ లైఫ్ వరకూ వెళ్లడం అనేది సమంజసం కాదు. అసలే ఈ పెళ్లి వేడుకలకి సినీ సహా రాజకీయ ప్రముఖులు దేశ వ్యాప్తంగా హాజరు కానున్నారు. మరి ఇలాంటి విషయాల్లో ఒకపక్క పెళ్లి అరేంజ్మెంట్స్ చేస్తున్న బృందంతో పాటుగా ఆడియెన్స్ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు