తన ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) సినిమాతో గ్లోబల్ రేంజ్ దర్శకునిగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మారిపోయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఒక్కదాని విషయంలో ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కేమెరూన్ ఇంకా స్పీల్ బర్గ్ లాంటి దిగ్గజాలు తమ ఎగ్జైట్మెంట్ ని షేర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళితో జేమ్స్ కేమెరూన్ జరిపిన చర్చ ఎంతటి సెన్సేషన్ గా మారిందో తెలిసిందే.
అవతార్, టైటానిక్, టెర్మినేటర్ లాంటి హాలీవుడ్ సెన్సేషన్ సినిమాలు చేసిన దర్శకుడు రాజమౌళి వర్క్ కి ఫిదా కావడం ఫ్యూచర్ లో కూడా ఏమన్నా అవసరం అయితే కలుద్దాం అన్నట్టు కూడా చెప్పడం ఇండియన్ సినిమా ఆడియెన్స్ కి ఒక ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కి ఒక ప్రత్యేక గర్వకారణంగా కూడా మారింది. మరి కేమెరూన్ నుంచి వస్తున్న అవైటెడ్ సీక్వెల్ అవతార్ 3 ప్రమోషన్స్ లో భాగంగా జక్కన్న, మహేష్ బాబుల వారణాసి ఇంకా అవతార్ యూనిట్స్ కలిసే క్రేజీ క్రాసోవర్ ఉంటుంది అని చాలామంది ఆశించారు.
అంతే కాకుండా వారణాసి గ్లింప్స్ ని అవతార్ 3 తో కూడా అటాచ్ చేస్తారనీ భావించారు. కానీ మధ్యలో అవన్నీ కొంచెం పక్కకి జరిగాయి కానీ ఫైనల్ గా ఆ సెన్సేషనల్ క్రాసోవర్ జరిగింది. దర్శకుడు రాజమౌళి అవతార్ 3 ప్రమోషన్స్ కోసం ఇండియాలో ముందుకు రాగా రాజమౌళితో జేమ్స్ కేమెరూన్ స్పెషల్ వీడియో చాట్ లో మాట్లాడ్డం వైరల్ గా మారింది. జక్కన్న వారణాసి సెట్స్ ని తాను విజిట్ చేయాలని అనుకుంటున్నాను అని తను తెలిపారు.
మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ చూడాలనుకుంటున్నాని అవతార్ దర్శకుడు తెలిపారు. అందుకు రాజమౌళి కూడా తప్పకుండా రావచ్చని అది తమకి ఎంతో ఆనందం అని తాను తెలిపారు. చాలా కాలం నుంచి షూట్ చేస్తున్నారు అనుకుంటా కదా అంటే అందుకు ఏడాది నుంచి షూట్ చేస్తున్నాం సర్ ఇంకో ఏడెనిమిది నెలలలో షూట్ పూర్తవుతుంది అని రాజమౌళి తెలిపారు. మీరు ఏదన్నా మంచి ఫన్ గా పులులు లాంటి వాటితో ఫన్ చేస్తే ఖచ్చితంగా చెప్పండి కలుద్దాం అంటూ తాను తెలిపారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ వైరల్ గా మారింది.
Dear @JimCameron, we’d be honoured to host you on the #VARANASI sets sir. ???????????????????????????????? pic.twitter.com/seIp1yXzYX
— Varanasi (@VaranasiMovie) December 17, 2025

