బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ స్పై చిత్రం “ధురంధర్” కోసం మొత్తం దేశం మాట్లాడుకుంటుంది. కేవలం హిందీలోనే వచ్చినప్పటికీ ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది.
అయితే హిందీ మార్కెట్ లో మన తెలుగు నుంచి వెళ్లిన చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కొన్ని వండర్స్ లాంటి రికార్డులు సెట్ చేయగా వాటిని ధురంధర్ సినిమా ఓపెనింగ్స్ మినహా ప్రతీ రికార్డు బ్రేక్ చేస్తుంది. ఇలా పుష్ప 2 సెట్ చేసిన ఒక యూనిక్ రికార్డు సింగిల్ వారంలో 199 కోట్ల నెట్ వసూళ్లు సాధించి నెవర్ బిఫోర్ రికార్డు సెట్ చేస్తే అంతా షాకయ్యారు.
ఇప్పుడు దీనిని కూడా ధురంధర్ సినిమా బద్దలుకొట్టి సింగిల్ వీక్ లో 200 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. అది కూడా ఒక ఏ సర్టిఫికెట్ సినిమా ఈ రేంజ్ లో పెర్ఫామ్ చేయడం అనేది ఊహాతీతం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఇక్కడితో కూడా ఆగేలా లేదు. మున్ముందు ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో కూడా చూడాలి.


