మొదటిసారి వరుణ్ తేజ్, నాగబాబు.. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం!

మొదటిసారి వరుణ్ తేజ్, నాగబాబు.. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం!

Published on Aug 6, 2026 11:04 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కొరియన్ కనకరాజు థియేటర్స్ లో విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత తన నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ నే ‘బరి’. వరుణ్ తేజ్ సొంత చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణం వహిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ తేజ్ ఒక వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమా షూట్ లో తనకి గాయం అయ్యి గ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ చిత్రం విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. వరుణ్ తేజ్ ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ఎప్పుడు తన తండ్రి నాగబాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ తండ్రీకొడుకులుగా కనిపించింది లేదు.

కానీ మొదటిసారి ఈ సినిమాలో ఇద్దరూ తండ్రీకొడుకులుగా బరి చిత్రంలో కనిపించనున్నట్టుగా తెలిసింది. దీనితో డెఫినెట్ గా ఎమోషనల్ వెయిట్ సినిమాలో పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి కమిటీ కుర్రోళ్ళు దర్శకుడు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు