ప్రభాస్‌ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

ప్రభాస్‌ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

Published on Dec 17, 2025 9:00 PM IST

the raja saab

ప్రభాస్‌ ఫ్యాన్స్ కు శుభవార్త. వెండితెరపై తమ డార్లింగ్‌ను ఒకరోజు ముందుగానే వీక్షించబోతున్నారు. కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘ది రాజాసాబ్’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే, ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. కాగా ఈ సందర్భంగా ‘రాజా సాబ్‌’ ప్రీమియర్స్‌ గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు.

జనవరి 8న స్పెషల్‌ ప్రీమియర్స్‌ వేయబోతున్నట్లు ఆయన తెలిపారు. పైగా త్వరలోనే హైదరాబాద్ ఓపెన్ గ్రౌండ్స్‌లో ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని టీజీ విశ్వప్రసాద్‌ చెప్పుకొచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు