తెలుగు రిలీజ్ డేట్ లాక్ చేసిన కన్నడ ఫాంటసీ చిత్రం

తెలుగు రిలీజ్ డేట్ లాక్ చేసిన కన్నడ ఫాంటసీ చిత్రం

Published on Dec 25, 2025 5:30 PM IST

Gatha-Vaibhavam

గత నెలలో కన్నడలో విడుదలై ఘనవిజయం సాధించిన ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఎస్.ఎస్. దుష్యంత్ మరియు ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సుని ఈ చిత్రాన్ని అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2026, జనవరి 1న కొత్త సంవత్సరం కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. మొదట కన్నడ వెర్షన్‌తో పాటే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

సుని సినిమాస్ మరియు సర్వేగర సిల్వర్ స్క్రీన్స్ నిర్మించిన ఈ చిత్రానికి జుడా సంధ్య సంగీతాన్ని అందించగా, విలియం జె. డేవిడ్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. కన్నడలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, తెలుగులో కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు