గ్లామర్ ట్రీట్‌తో ‘భైరవి’ ర్యాంపేజ్.. ‘రాజాసాబ్’లో స్పైసీ ప్యాకేజ్..!

గ్లామర్ ట్రీట్‌తో ‘భైరవి’ ర్యాంపేజ్.. ‘రాజాసాబ్’లో స్పైసీ ప్యాకేజ్..!

Published on Dec 27, 2025 12:00 AM IST

Bhairavi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రం నుండి తాజాగా మాళవిక మోహనన్ పాత్ర ‘భైరవి’కి

(Bhairavi)

సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బ్లాక్ సారీలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ ర్యాంపేజ్ క్రియేట్ చేసేందుకు మాళవిక సిద్ధంగా ఉందన్నట్లు ఈ పోస్టర్ ఉంది.

కాగా, ఈ పోస్టర్ చూస్తుంటే ‘ది రాజాసాబ్’ చిత్రంలో అమ్మడు స్పైసీ ప్యాకేజ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మరో ఇద్దరు గుమ్మలు కూడా గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గకుండా చూస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో వేచి చూడాలి.

తాజా వార్తలు