‘పెద్ది’ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘పెద్ది’ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 28, 2025 7:00 AM IST

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే షెడ్యూల్ లో జాన్వీ కపూర్ – చరణ్ లపై ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో చరణ్ తో కలిసి జాన్వీ క్రేజీ స్టెప్స్ వేయబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ గ్లామర్ కూడా హైలైట్ గా ఉంటుందట.

కాగా, ఇప్ప‌టి వ‌ర‌కూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. మొత్తానికి బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్న‌మైందట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ‘పెద్ది’ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు