‘ది రాజాసాబ్’ నుంచి తమన్ క్రేజీ అప్ డేట్ !

‘ది రాజాసాబ్’ నుంచి తమన్ క్రేజీ అప్ డేట్ !

Published on Dec 28, 2025 5:03 PM IST

The Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్'(The Raja Saab) సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఐతే, ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా ‘ట్రైలర్’ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ క్రేజీ అప్‌ డేట్‌ ను అందించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్‌ను తాను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మిగిలిన సగం పనిని కూడా పూర్తి చేయనున్నట్లు తమన్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అన్నట్టు ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

th

తాజా వార్తలు