పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పట్ల అభిమానులు గట్టి హైప్ పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ మారుస్తున్న మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఆ మధ్య షాకయ్యారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ కొంచెం సన్నగా మారడం పైగా గడ్డం, మీసం స్టైల్ కూడా మార్చడం జరిగింది.
కానీ ఈ మధ్య బయటకి వచ్చిన లుక్ మాత్రం ఇదే సినిమాలో ఫైనల్ కాదని చెప్పాలి. స్పిరిట్ లో ప్రభాస్ పై మరో క్రేజీ వేరియేషన్ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగకి ఒక అలవాటు ఉంది. తాను సినిమా చేస్తున్నప్పుడు తన హీరో లుక్ లోనే తాను కూడా మైంటైన్ అవుతూ ఉంటాడు. అలానే అర్జున్ రెడ్డి, అనిమల్ కి కూడా కొనసాగాడు.
ఆ మధ్య క్లీన్ షేవ్ కేవలం మీసకట్టు మాత్రమే ఉంచి షాకిచ్చాడు. దీనితో అదే ప్రభాస్ స్పిరిట్ లుక్ అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు కనిపిస్తున్న లుక్ కూడా కాదు మరో లుక్ ఇందులో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్, తదితరులతో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో మేకోవర్ లోకి ప్రభాస్ మారేందుకు కొంచెం సమయం అయితే ఉంది.


