పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఐతే, ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానుల నిరీక్షణ నేటితో ముగియనుంది. రాజా సాబ్ ‘రిలీజ్ ట్రైలర్’ ఈరోజే విడుదలవుతుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. అధికారిక ప్రకటన కోసం వేచి ఉండమని అభిమానులను కోరింది టీమ్. వాస్తవానికి ‘రిలీజ్ ట్రైలర్’ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా, కాస్త ఆలస్యమైంది. మొత్తానికి ట్రైలర్ అయితే రాబోతుంది.
మరి ఈ ‘రిలీజ్ ట్రైలర్’ ఎలా ఉండబోతుందో చూడాలి. ట్రైలర్ లో కట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెబుతున్నారు. కాగా రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అన్నట్టు ప్రభాస్ తో పాటు, ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
#TheRajaSaab Trailer 2.O…….⏳⏳????????
— The RajaSaab (@rajasaabmovie) December 29, 2025


