‘జబర్దస్త్’ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఇమ్మాన్యుల్, బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ తనదైన ముద్ర వేసి టాప్ 4 ఫైనలిస్ట్‌గా నిలిచారు. షో ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, బిగ్ బాస్ తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందని, ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు.
బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లు నటిస్తారని బయట జరిగే ప్రచారంపై ఇమ్మాన్యుల్ స్పందించారు. గంటల తరబడి, రోజుల కొద్దీ ఎవరూ నటించలేరని, అంతటి మహానటులు ఇంకా పుట్టలేదని ఆయన స్పష్టం చేశారు. హౌస్‌లో పరిస్థితులు, భావోద్వేగాలు అన్నీ సహజంగానే ఉంటాయని వివరించారు.
హౌస్‌లో తోటి సభ్యులతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన స్నేహం జీవితాంతం కొనసాగుతుందని ఇమ్మాన్యుల్ పేర్కొన్నారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన ‘విజనరీ హౌస్’ సభ్యులకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
షో విజేతగా నిలిచిన కల్యాణ్‌కు ఇమ్మాన్యుల్ శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు టైటిల్ దక్కలేదనే అసంతృప్తి ఏమాత్రం లేదని, టాప్ 4 వరకు రావడం సంతోషంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.


