ఇంటర్వూ : దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి – ‘పతంగ్’ చిత్రాన్ని థియేటర్‌లోనే ఎంజాయ్ చేస్తారు..!

ఇంటర్వూ : దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి – ‘పతంగ్’ చిత్రాన్ని థియేటర్‌లోనే ఎంజాయ్ చేస్తారు..!

Published on Dec 29, 2025 7:00 PM IST

Praneeth Pathipati

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘పతంగ్’. ప్రణవ్ కౌశిక్, వంశీ పుజిత్, ప్రీతీ పగడాల ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా గతవారం రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో తమ చిత్ర యూనిట్ సంతోషంగా ఉందని తెలిపారు దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి తాజాగా విలేకరులతో మాట్లాడారు.

ఫీడ్‌బ్యాక్‌ ఎలా ఉంది?

టాక్‌తో పాటు కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యూనివర్సల్‌గా ఈ సినిమాకు హిట్‌టాక్‌..తో పాటు ఓ మంచిసినిమావ చూశామన్న సంతృప్తిని ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా పతాక సన్నివేశాలు ఓ స్టేడియంలో ఓ మ్యాచ్‌ను చూస్తున్నఅనుభూతికి లోనవుతున్నారు.

పతంగుల పోటీ నేపథ్యంలో సినిమా తీయడానికి కారణం ఏమిటి?

ఓ సంక్రాంతి రోజు అనిపించింది. మనం ఫారిన్‌ నుంచి తీసుకొచ్చిన రగ్బిలాంటి స్టోరీతో సినిమాలు తీశాం కానీ ఇది మన నేటివిటి స్పోర్ట్స్‌ కదా.. దీని మీద మనం ఎందుకు తీయలేము అని పతంగ్‌ను మొదలుపెట్టాం. సినిమా మొదలు పెట్టిన తరువాత ఎందుకు తీయలేదో అనే విషయం సీజీ వర్క్‌ అప్పుడు తెలిసింది. సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టింది.

మూడు సంవత్సరాల సమయంలో నిర్మాతల సపోర్ట్‌ మీకు ఎలా ఉంది?

ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌ మా నిర్మాతలే నేను ఎక్కడైనా రాజీపడ్డ వాళ్లు మాత్రం రాజీపడలేదు. ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ రోజు సినిమా ఇంత రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపించడానికి వాళ్లు పెట్టిన ఖర్చే కారణం.

ఈ కిస్మస్‌ సీజన్‌లో విడుదల కావడంతో మీకు సరైన థియేటర్లు దొరకలేదు అంటున్నారు?

థియేటర్లు ట్రై చేస్తున్నాం. సినిమా తీయడంతో ఇక అయిపోయింది అనుకునేవాడ్ని.కానీ సినిమా తీసిన తరువాత మళ్లీ ప్రమోషన్‌,రిలీజ్‌ ఇంత పని ఉంటుందా అని నాకు ఈసినిమాతోనే తెలిసింది. మౌత్‌టాక్‌తో సినిమా బాగుంది అని తెలిసినా సరైన థియేటర్లు , టైమింగ్స్‌ లేకపోవడంతో సినిమా బాగున్నా జనాలకు అందుబాటులో లేకపోవడవం తో చూడలేకపోతున్నారు. అయితే సినిమా ఆడుతున్న థియేటర్లుమాత్రం ఫుల్‌ అవుతున్నాయి.

దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించారు? ఆ ఐడియా ఎవరిది?

స్క్రిప్ట్‌లో అనుకున్న ప్రకారం ఆ పాత్రకు మొదట సందీప్‌ రెడ్డి వంగా, దిల్‌రాజు, ఎస్‌జే సూర్య నాగ్‌ అశ్విన్‌, ఇలా ఎక్స్‌పెక్ట్‌ చేయని వాళ్లను అడిగాం. కానీ వర్కింగ్ డేస్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. ఇక సినిమాలో గౌతమ్‌ మీనన్‌ పాత్రనున గౌతమ్‌మీనన్‌ చేస్తే బాగుంటుందని అయన్ని ఆప్రోచ్‌ అయ్యాం. ఆయనపాత్ర కథ,విని ఒప్పుకున్నారు. ఆయన మీద పంచ్‌లు వేయడం కూడా బాగా నచ్చింది.

ఈ సినిమా కొత్తవాళ్లతో చేయడానికి కారణం?

కథకు తగ్గట్టుగా కొత్తవాళ్లతోనే అనుకున్నాం. కథ, మాటలు అన్నీ నేను రాసుకున్నాను.

మీ టేకింగ్‌ను చాలా మంది శేఖర్‌ కమ్ములతో పోల్చుతున్నారు?

అవునండి.. నా మిత్రులు కూడా అందే అంటున్నారు. ఓ గొప్ప దర్శకుడితో పోల్చడం నాకు కూడా హ్యపీనే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు