సమీక్ష :-  ‘పురుష:’ –  కొన్ని చోట్ల మెప్పించే సింపుల్ ఫ్యామిలీ ఫన్ డ్రామా !

సమీక్ష :-  ‘పురుష:’ –  కొన్ని చోట్ల మెప్పించే సింపుల్ ఫ్యామిలీ ఫన్ డ్రామా !

Published on May 22, 2026 12:38 PM IST

Purushaha Review

విడుదల తేదీ : మే 22, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, వెన్నెల కిశోర్‌, రాజీవ్ కనకాల, వీటీవీ గణేశ్‌, అనంత్‌ శ్రీరామ్‌, పమ్మి సాయి, మిర్చి కిరణ్‌ తదితరులు.
దర్శకుడు : వీరు వులవల
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం : సతీష్ ముత్యాల
కూర్పు : కోటి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా వీరు వులవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

గోవింద్ (బత్తుల పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్‌కుమార్) ముగ్గురు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. అందరికి పెళ్ళిళ్లు అయ్యాక కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. అయితే, తమ దాంపత్య వ్యక్తిగత జీవితాల్లోని సమస్యలకు ముగ్గురు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు గోవింద్ అతని భార్య కమల (రాయంచ కొక్కుర) ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ, పెళ్లి అయ్యాక, గోవింద్ కి గతంలో రోజీ అనే అమ్మాయితో ప్రేమ కహానీ ఉందని, పైగా ఇప్పటికీ అతని మనసులో ఆమె ఉందని కమల బలంగా నమ్ముతుంది. సత్తి, శ్రీను జీవితాల్లో కూడా ఇలాంటి సమస్య కారణంగానే వారిద్దరూ కూడా భార్యలకు దూరం అవుతారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. ఈ ముగ్గురి స్నేహితులు
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇంతకీ, ఈ ముగ్గురి కోసం వారి భార్యలు ఏం చేశారు ?, అసలు ఈ ముగ్గురు చేసిన తప్పు ఏమిటి ?, చివరకు తమ భార్యలతో వీళ్లు కలిశారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :-

బ్రహ్మచారి భర్తగా మారక, అతని గత జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ సంబంధ బాంధవ్యాల గురించి.. భార్యకు తెలిస్తే.. ఆ భర్త పరిస్థితి ఏంటి ? నిజంగానే జీవితం యుద్ధభూమిలా మారుతుంది. ఇదే పాయింట్ చుట్టూ సాగింది ఈ సినిమా. భర్తలకు – భార్యలకు మధ్య వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు పడే తిప్పలు, తమ సమస్యలతో వారు నలిగిపోయే తీరు బాగానే సాగాయి.  “పెళ్లాం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ ఫుల్‌గా బయటకు వస్తాడు” లాంటి పంచ్ డైలాగ్స్ భర్తలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బత్తుల పవన్ కళ్యాణ్ పోషించిన ప్రధాన పాత్ర అయిన గోవింద్  పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన పెళ్లి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్.. ఇలా  మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు.

అయితే, ఈ సినిమాకి ప్రధాన బలం మాత్రం..వెన్నెల కిశోర్‌, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమారే. తమ కామెడీ టైమింగ్ తో ఈ ముగ్గురు కొన్ని చోట్ల బాగానే నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ రాయంచ కొక్కుర కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో కీలక పాత్రల్లో నటించిన విషిక, హాసిని సుధీర్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమ గ్లామర్ తో మెప్పించారు. రాజీవ్ కనకాల, వీటీవీ గణేశ్‌ తమ మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. అనంత్‌ శ్రీరామ్‌ నటన బాగున్నా.. ఆయన పాత్రను ఇంకా బెటర్ గా మలిచి ఉండాల్సింది. ఇక పమ్మి సాయి, మిర్చి కిరణ్‌ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘పురుష:’ స్క్రీన్ ప్లే  బాగా స్లోగా సాగింది. అలాగే,  సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఐతే, దర్శకుడు పనితనం, నటీనటుల నటన సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథ కథనాల్లో ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు ఈ ‘పురుష:’కి మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి. మొత్తానికి ఈ ఎమోషనల్ అండ్ ఫన్ ఫ్యామిలీ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్  పర్వాలేదకున్నా.. మిగిలిన కంటెంట్ ఆసక్తికరంగా అయితే సాగలేదు. ఇలాంటి సినిమా  ఇంకా తక్కువ నిడివిలో ఉండి ఉంటే,  ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. మరి దర్శకనిర్మాతలు ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేదో వాళ్లకే తెలియాలి. మొత్తానికి కొన్ని కీలక సన్నివేశాలు కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి.

సాంకేతిక విభాగం : 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ అండ్ ఫన్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే..  లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సతీష్ ముత్యాల వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది.  ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది. ఈ చిత్ర నిర్మాత బత్తుల కోటేశ్వరరావు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

‘పురుష:’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ కామెడీ డ్రామాలో.. కొన్ని కామెడీ అండ్ ఫ్యామిలీ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు