మన శంకర వరప్రసాద్ గారు’ సాంగ్ కి సాలిడ్ ప్లాన్ టూర్!

మన శంకర వరప్రసాద్ గారు’ సాంగ్ కి సాలిడ్ ప్లాన్ టూర్!

Published on Dec 30, 2025 9:30 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు” కోసం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి మూడో సాంగ్ కోసం మేకర్స్ మంచి ప్లాన్ ని డిజైన్ చేశారు. ఈ ఉదయం 9 గంటల నుంచే మీట్ టీం 9 గంటలకి విజయవాడలో అమ్మవారు దర్శనం చేసుకోనుండగా ఆ తర్వాత తొమ్మిదిన్నరకి ప్రెస్ మీట్ ని నిర్వహిస్తారని తెలిపారు.

ఇక 11 గంటలకి గుంటూరులో సంక్రాంతి సంబరాలు చేయనున్నారు. ఇక నెక్స్ట్ సాయంత్రం 3 గంటలకి అవైటెడ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సాంగ్ కోసం చిరంజీవి మరియు వెంకీ మామ ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 12న సాంగ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు