ఘనంగా ‘శంబాల’ విజయోత్సవ వేడుక.. ఆది సక్సెస్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు

ఘనంగా ‘శంబాల’ విజయోత్సవ వేడుక.. ఆది సక్సెస్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు

Published on Dec 30, 2025 9:00 PM IST

sa 4

ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ‘శంబాల’ చిత్రం డిసెంబర్ 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ‘డివైన్ బ్లాక్ బస్టర్’ పేరుతో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు బాబీ, వశిష్ట, రచయిత కోన వెంకట్, హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సాయి కుమార్ కుటుంబంతో తమకు మూడు తరాల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ‘శంబాల’ ట్రైలర్ చూసి అల్లు అర్జున్ కూడా ఆదికి మెసేజ్ చేశారని, కొడుకు విజయం సాధిస్తే తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో తనకు తెలుసని పేర్కొన్నారు. ఆది ఇప్పుడు హైవే ఎక్కినట్టేనని, ఇకపై మంచి పాత్రలతో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.

ఈ విజయం తన తండ్రి సాయి కుమార్ సినీ జీవితానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆది సాయి కుమార్ తెలిపారు. నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించిందని సందీప్ కిషన్, బాబీ పేర్కొన్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం, యుగంధర్ ముని దర్శకత్వ ప్రతిభ సినిమా విజయానికి ప్రధాన కారణాలని వక్తలు కొనియాడారు. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు