అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ రస్టిక్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
అయితే, ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర వర్గాలు స్పందిస్తూ, “అనన్య బృందంతో చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, ఇంకా ఏదీ ఖరారు కాలేదు” అని స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామాలో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
గతంలో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనన్యకు ఆ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే, అఖిల్ సినిమాలో ఒక క్రేజీ సాంగ్ చేయడం ద్వారా ఈసారి టాలీవుడ్‌లో తన ముద్ర వేయాలని ఆమె ఆశిస్తోంది. మరోవైపు, ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.


