ప్రభాస్ పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!

ప్రభాస్ పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!

Published on Jan 7, 2026 8:08 PM IST

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్-ఫాంటసీ టచ్‌తో కూడిన ఈ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా, ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ది రాజా సాబ్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌తో పాటు హీరోయిన్లను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో “ప్రభాస్ (Prabhas) చాలా షై అన్న సంగతి విన్నాను. కానీ ఆయన షైనెస్ ఇంకో లెవెల్‌లో ఉంటుంది. అది నిజంగా చాలా ఎక్కువ” అంటూ సందీప్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ప్రభాస్ (Prabhas) తనతో ది రాజా సాబ్ గురించి చెప్పిన విషయాలను కూడా సందీప్ వంగా పంచుకున్నారు. “భారీ సెట్లు ఉన్నాయి, ముగ్గురు హీరోయిన్లు, పాటలు ఉన్నాయి, దాది (అమ్మమ్మ) పాత్ర కూడా ఉందని ప్రభాస్ అన్నాడు” అని చెప్పారు. ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్ వీడియోను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా జరినా వహాబ్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు