ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ దగ్గర దుమ్ము లేపుతున్న సెన్సేషనల్ హాలీవుడ్ హిట్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ కూడా ఒకటి. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం భారతీయ మార్కెట్ లో సంచలన ఓపెనింగ్స్ సాధించి హాలీవుడ్ హిస్టరీలో రికార్డు సెట్ చేసింది.
ఇక రెండో రోజు అది కూడా వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి రోజే 73 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం రెండో రోజు 60 కోట్ల మేర గ్రాస్ రాబట్టి ఒక బ్యాంగర్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇలా మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమా 131.4 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఇక ఈ శనివారం ఉంది, ఆదివారం కూడా ఉంది. ఈ రెండు రోజుల్లో స్పైడర్ మ్యాన్ ఈజీగా 250 కోట్ల మార్క్ ని దాటేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో టామ్ హోలాండ్ హీరోగా నటించగా జెండాయ హీరోయిన్ గా నటించింది. అలాగే డెస్టిన్ డానియల్ దర్శకత్వం వహించారు.
A brand new milestone 💯#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio. pic.twitter.com/1RB5dLBe6I
— Sony Pictures India (@SonyPicsIndia) August 1, 2026


