శంకర వరప్రసాద్ గారికి ఏపీలో బూస్ట్.. టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ!

శంకర వరప్రసాద్ గారికి ఏపీలో బూస్ట్.. టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ!

Published on Jan 9, 2026 7:33 PM IST

మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ జీవోను జారీ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆదివారం రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనుండగా, వాటికి ఒక్క టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500 వరకు వసూలు చేసుకునే అనుమతి ప్రభుత్వం ఇచ్చింది. ఈ నిర్ణయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

ఇక సోమవారం (జనవరి 12) నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షోల కోసం కూడా టికెట్ ధరలు పెంచారు. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.247గా, మల్టీప్లెక్సుల్లో రూ.302గా ఖరారైంది. ఈ పెరిగిన ధరలు మొదటి పది రోజుల పాటు అమల్లో ఉండగా, ఈ సమయంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. కంటెంట్ ఆశించిన స్థాయిలో ఉంటే, బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మరోసారి సునామీ సృష్టిస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ap

తాజా వార్తలు