కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘వా వాథియర్’. దీనినే తెలుగులో “అన్నగారు వస్తారు” గా డబ్బింగ్ చేసి రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఊహించని విధంగా గత డిసెంబర్ లో ట్విస్ట్ ఎదురై సినిమా రిలీజ్ ఆగిపోయింది. కానీ అక్కడ నుంచి సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఎవరికీ క్లారిటీ లేదు.
అయితే ఇప్పుడు కోలీవుడ్ లో అనుకోని విధంగా పరిస్థితులు మారడంతో ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు అని బజ్ వినిపిస్తుంది. ఇలా జనవరి 14న సినిమా వస్తుంది అంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే తెలుగు రిలీజ్ పై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.


