The Raja Saab: ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. 4 రోజుల్లో 200 కోట్లు!

The Raja Saab: ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. 4 రోజుల్లో 200 కోట్లు!

Published on Jan 13, 2026 12:58 PM IST

The Raja Saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన అవైటెడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్” (The Raja Saab). మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చింది. ఇక ఈ సినిమా ఒకింత మిక్స్డ్ టాక్ నే తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం ప్రభాస్ రేంజ్ లోనే వస్తున్నాయి.

ఇలా మొదటి రోజే 100 కోట్లకి పైగా ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు నాలుగు రోజుల్లో ఏకంగా 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది. మేకర్స్ ఈ చిత్రం 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా డెఫినెట్ గా 300 కోట్ల క్లబ్ లో కూడా చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు