‘అనగనగా ఒక రాజు’తో స్టార్ ఎంటర్టైనర్ మరోసారి!

‘అనగనగా ఒక రాజు’తో స్టార్ ఎంటర్టైనర్ మరోసారి!

Published on Jan 15, 2026 12:00 AM IST

Anaganaga Oka Raju

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అనగనగా ఒక రాజు కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకొని వచ్చిన ఈ చిత్రం జెనరల్ ఆడియెన్స్ లో మంచి బజ్ ని సెట్ చేసుకుంది. స్టార్ ఎంటర్టైనర్ గా మినిమమ్ గ్యారెంటీ ఫీల్ ని నవీన్ తెలుగు ఆడియెన్స్ లో అందించగా కొంచెం సమయం తీసుకున్నా కూడా అనగనగా ఒక రాజు తో మరో క్లీన్ హిట్ అందుకున్నట్టే అని చెప్పాలి.

హీరోగా అరంగేట్రం చేసిన తర్వాత నవీన్ ఒకో సినిమాకి కొంచెం గ్యాప్ తీసుకున్నప్పటికీ ఈ సంక్రాంతి సినిమాకి కూడా సాలిడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. దీనితో అనగనగా ఒక రోజు సినిమాతో కూడా తాను హిట్ అందుకున్నట్టే అని చెప్పాలి. డే 1 కి ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సో ఇలా మరోసారి స్టార్ ఎంటర్టైనర్ కొట్టేసినట్టే అని అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు